రగులుతున్న లాస్ ఏంజెలెస్.. రణరంగంలా వీధులు! రాజకీయ దుమారం..
Mon Jun 09, 2025 16:08 U S A
అమెరికాలోని అందాల నగరం లాస్ ఏంజెలెస్ వలసదారుల ఆందోళనలు.. దాడులతో రణరంగంలా మారింది. సిటీలోని వాణిజ్య ప్రాంతమైన డౌన్లైన్లో ఎవరూ గుమికూడ వద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ భద్రతా దళాలు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఓ రిపోర్టర్కు రబ్బరు తూటా తగిలింది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) విభాగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 2,000 మంది ఆందోళనకారులు డౌన్టౌన్లోని ప్రధాన హైవేను తమ అధీనంలోకి తీసుకొన్నారు. ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు వారు నిప్పు పెట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో 101 ఫ్రీవేను ఆందోళనకారులు అడ్డుకొన్నారు. దీంతో అధికారులు ఆ మార్గాన్ని మూసేశారు. ఆందోళనకారులు పోలీసులపై రకరకాల వస్తువులు విసిరి దాడికి యత్నించారు. చాలా పోలీసు వాహనాలు తగలపెట్టారు. పసిఫిక్ సముద్రం పక్క నుంచి ఈ మార్గం దాదాపు 1500 మైళ్లు ప్రయాణిస్తుంది.
ఇది కూడా చదవండి: ఆయన చేసిన కామెంట్స్ చివరికి ఇలా... జోరుగా వైరల్ అవుతున్న ట్రంప్ వీడియో!
గత కొన్నాళ్లుగా ట్రంప్ నకు బద్దవిరోధిలా ప్రవర్తిస్తున్న మస్క్.. తాజాగా లాస్ ఏంజెలెస్ నేషనల్ గార్డ్లను రంగంలోకి దింపాలనే ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టాడు. కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజెలెస్ మేయర్లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ట్రంప్ చేసిన పోస్టు స్క్రీన్ షాట్ను షేర్ చేశాడు. దీంతోపాటు జేడీ వాన్స్ పోస్టులను కూడా రీపోస్టు చేశాడు. లాస్ ఏంజెలెస్ లో మాస్కుల్లో ఉన్న ఆందోళనకారులను అరెస్టు చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జరిగిన ఆందోళనల్లో మాస్క్ వినియోగాన్ని ఆయన నిషేధించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, లాస్ ఏంజెలెస్ స్థానిక నాయకత్వం మధ్య ఘర్షణ కూడా పెరుగుతోంది. తాజాగా ఆ నగర మేయర్ కరెన్ బాస్ మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళనలు జరగాలన్నారు. ఇక ట్రంప్ వ్యవహార శైలిని తప్పపట్టారు. "లాస్ ఏజెంలెస్ లోని పరిస్థితిని రెచ్చగొట్టింది పాలకవర్గమే. పని ప్రాంగణాలు వంటి వాటిపై దాడులు నిర్వహించి తల్లిదండ్రులు, పిల్లలను వేధిస్తే.. సాయుధ బలగాలతో వీధుల్లో కవాతు చేయించి.. మీరు ప్రజల్లో భయం, ఆందోళన సృష్టిస్తున్నారు" అని పేర్కొన్నారు. ఈ నగరంలో ఆందోళనలను అణిచివేయాలని 2,000 మంది నేషనల్ గార్డ్స్ను ట్రంప్ కార్యవర్గం సిద్ధం చేసింది. ఇప్పటికే 300 మంది ఆ నగరానికి చేరుకొన్నారు. "ఒకప్పుడు అమెరికాలో గొప్ప నగరమైన లాస్ ఏంజెలెస్ను అక్రమ వలసదారులు క్రిమినల్స్ ఆక్రమించుకొన్నారు" అని సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..
జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..
కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #USA #USANews #NationalGuard #Deployment #AgainstImmigration #laProtests
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.